తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి – భట్టి విక్రమార్క

Saturday, August 29th, 2020, 07:22:56 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క‌రోనా బాదితుల‌ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రజా వైద్యం పైన సీఎం కేసీఆర్‌కు ప‌ట్టింపు లేద‌ని మండిపడ్డారు. ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సెక్యూరిటీ సిబ్బందితో నెట్టి వేసే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు.

అయితే రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్క‌రి మ‌ర‌ణానికి కేసీఆర్ కార‌ణం అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఐసొలేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సూచించారు.