జమ్మూ కాశ్మీర్ లో పోటాపోటీగా భాజపా, పిడిపీ

Tuesday, December 23rd, 2014, 12:15:10 PM IST

bjp-and-pddp
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తొలి ఫలితం విడుదలైనది. కాగా ముందుగా విడుదలైన హిరాణా నగర్ ఫలితంలో భాజపా అభ్యర్ధి కుల్ దీప్ రాజ్ విజయం సాధించారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో పిడిపీ 21 స్థానాలు, భాజపా 22 స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ 14 స్థానాలలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ 12 స్థానాలలోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే జమ్మూ కాశ్మీర్ లో హాంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లోని 87 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 4, ఎన్సీ 3, పీడీపీ 4 , కాంగ్రెస్ 1 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకున్నాయి. కాగా జమ్మూ లో భాజపా తన సత్తా చాటుతుంటే కాశ్మీర్ లో పిడిపీ ముందుకు దూసుకుపోతోంది.