ఆడపిల్లలు మద్యం సేవించి స్కూల్ కి వచ్చారు.. క్లాస్ లో చతికిల పడ్డారు..!

Monday, February 22nd, 2016, 06:04:40 PM IST


ఇటీవల కాలంలో మద్యం సేవించడం ఒక ఫ్యాషన్ అయిపొయింది. మనం చిన్నప్పుడో ఎప్పుడో చుట్టతాగనివాడు దున్నపోతై పుడతాడు అని పెద్దవాళ్ళు చెప్పగా విన్నాం. తరువాత, ఎవరైనా మందు కొట్టి ఊర్లోకి వస్తే.. వాళ్ళని ఏదో కొత్త జంతువును చూసినట్టు చూస్తాం. కాని, ఇప్పుడు పరిస్థితి మారింది. మందు తాగడం ఫ్యాషన్ అయిపొయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా మద్యం పుచ్చుకుంటున్నారు.

ఇక ఇటీవలే కొంతమంది ఆడపిల్లలు మందుకొట్టి స్కూల్ కి వచ్చారు. వారు చదువుతున్నది 9 వ తరగతే.. అయితేనేం .. కూల్ డ్రింక్ మందు కలిపి ఫుల్ గా తాగేసి స్కూల్ కి వచ్చారు. ఇక క్లాస్ లో మత్తుగా కూర్చొని ఉన్న విద్యార్ధినులను ఉపాధ్యాయుడు గమనించి వారిని బయటకు పంపించివేశారు. అయితే, వేరు బయటకు వచ్చి కింద పడిపోయారట. ఈ సంఘటన తమిళనాడులోని పాండిచ్చేరిలో జరిగింది. గతంలో తమిళనాడులో ఇటువంటి సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం విశేషం.