టీడీపీ మాజీ మంత్రి నారాయణ కి సీఐడీ నోటీసులు

Wednesday, March 17th, 2021, 03:32:56 PM IST

తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి నారాయణ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఐడి నోటీసులు జారీ చేసింది. అయితే నారాయణ తన నివాసం లో లేకపోవడం తో ఆయన భార్య రమాదేవి కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 22 వ తేదీన ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలి అంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం లో చంద్రబాబు తో పాటుగా నారాయణ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నారాయణ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఐడి 166, 167, 217 సెకన్ల కింద కేసులు నమోదు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నారాయణ పేరును ఏ 2 గా చేర్చినట్లు సమాచారం. అయితే సీఐడీ విచారణ కి హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని అందులో తెలిపింది.

అయితే నారాయణ విద్యా సంస్థలు, కార్యాలయాలు, నివాసం లో ఏక కాలంలో సీఐడీ సోదాలు చేపట్టింది. అయితే అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయం లో అధికారులు ఇంట్లోకి ఎవరినీ కూడా అనుమతించలేదు. అయితే చంద్రబాబు నాయుడు తో పాటుగా, నారాయణ కూడా అమరావతి భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై తెలుగు దేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.