బిగ్ న్యూస్: చంద్రబాబు కి ఏపీ సీఐడీ నోటీసులు!

Tuesday, March 16th, 2021, 09:51:47 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.నేడు ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన అధికారులు రాజధాని లోని అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాల విషయం లో విచారణ కి సంబందించి నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు ఇచ్చిన తేదీ లో సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ తీసుకోనున్నారు.

అయితే అమరావతి రాజధాని విషయం లో మొదటి నుండి కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటూ అధికార పార్టీ కి చెందిన నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. పలువురు తెలుగు దేశం పార్టీ కిచెందిన నేతలు పేర్లు సైతం గతం లో వైసీపీ నేతలు ప్రస్తావించారు. అయితే 41 సీఆర్పిసి కింద చంద్రబాబు కి నోటీసులు ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.