మీ దగ్గర ఆధారాలేమున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఈడీ నోటీసులు..!

Thursday, March 18th, 2021, 01:06:35 AM IST


వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సీఐడీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి భూముల కుంభకోణం ఆరోపణల కేసు విషయంలో సీఐడీ అధికారులు ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణకు సీఆర్పీసీ 41 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

అయితే అమరావతి అసైన్డ్ భూముల విక్రయాల వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డే ఫిర్యాదు చేశాడు. అయితే దీనికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఏమున్నాయో చూపించాలి అంటూ సీఐడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సీఆర్పీసీ 41 కింద ఈ నెల 22న మంత్రి నారాయణను, 23న చంద్రబాబును విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎమ్మెల్యే ఆర్కేకు కూడా నోటీసులు పంపించి రేపు ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.