టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు షాక్.. సీఐడీ నోటీసులు..!

Thursday, September 24th, 2020, 01:02:11 PM IST

టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని భూమా అఖిలప్రియ ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో భూమాకు నోటీసులు పంపి విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు.

అంతేకాదు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఓ ప్రజాప్రతినిధి కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ ప్రధాని మోదీకి బైరెడ్డి లేఖ రాశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు బైరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ, బైరెడ్డితో పాటు మరో ముగ్గురికి కూడా సీఐడీ నోటీసులు పంపి విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.