టీడీపీ హయాంలో ఇచ్చిన జీఓ ల పై సీఐడీ లోతుగా దర్యాప్తు

Sunday, March 28th, 2021, 08:38:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి లో భూ కుంభకోణం జరిగింది అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ కేసులో సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. అసైన్డ్ భూములు కేసుల మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ, తెలుగు దేశం పార్టీ హయాంలో జీఓ ల తయారీకి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అస్సైన్డ్ మరియు లంక భూముల జీఓ ల వెనుక ఉన్నటువంటి నోట్ ఫైల్స్ ను సీఐడీ సేకరిస్తోంది. అయితే రైతుల నుండి సేకరించిన ఆధారాలను మరియు నోట్ ఫైల్స్ ను సీఐడీ కోర్టుకు అందజేయనుంది. అయితే దీని పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది సీఐడీ.

అయితే అమరావతి భూ కుంభకోణం కేసులో ఏ 1 గా చంద్రబాబు ను, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ను సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. రాజధాని కోసం సేకరించిన భూమి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ మొదటి నుండి వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు కూడా చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఇటీవల ఈ కేసుకు సంబంధించి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే.