పీఎం మోడీకి, ఇండియా కి థాంక్స్ చెప్పిన క్రిస్ గేల్

Friday, March 19th, 2021, 01:29:31 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే భారత్ తో పాటుగా ఇతర దేశాలు కూడా కరోనా వైరస్ మహమ్మారి తో పోరాడుతూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ కి వాక్సిన్ ను భారత్ కనుగొన్న సంగతి తెలిసిందే. కోవీ షీల్డ్, కొవాగ్జిన్ రెండు వాక్సిన్ లను అందుబాటులో కి కూడా తీసుకు వచ్చింది. అయితే ఇప్పటి కే భారత్ లో వాక్సినేశన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ లో రెండవ దశ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్ల మందికి వాక్సిన్ లను పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే మన తో పాటుగా, ఇతర దేశాలకు సైతం కేంద్ర వాక్సిన్ ను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మేరకు తమకు, తమ దేశానికి వాక్సిన్ ను సరఫరా చేయడం పట్ల ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, భారత్ కి థాంక్స్ అంటూ క్రిస్ గేల్ చెప్పుకొచ్చారు. క్రిస్ గేల్ విదేశీ ఆటగాడు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపియల్ లో ఆడటం తో ప్రతి ఒక్కరూ కూడా క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.