యూనివ‌ర్సల్ బాస్ క్రిస్ గేల్ ఖాతాలో మరో రికార్డ్..!

Friday, October 16th, 2020, 06:40:26 PM IST

యూనివ‌ర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎట్టకేలకు ఈ ఐపీఎల్ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న గేల్ పుడ్‌ పాయిజన్ కారణంగా మొదటి ఏడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన క్రిస్ గేల్ తొలి మ్యాచ్ లోనే త‌న‌దైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టాడు. 45 బంతుల్లో 5 సిక్సులు, 1 ఫోర్‌తో 53 పరుగులు చేసి పంజాబ్ జ‌ట్టు విజయంలో కీలక పాత్ర పోశించాడు.

ఇదిలా ఉంటే ఈ ఫార్మట్‌లో 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను క్రాస్ చేసిన గేల్, ఫోర్లు, సిక్సుల ద్వారా అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తం 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. టీ20 ఫార్మట్‌లో ఫోర్లు, సిక్సుల ద్వారా గేల్ 2,010 పరుగులు చేశాడు. ఇప్పటివరకు టీ20ల్లో గేల్ 13,349 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో మొత్తం 126 మ్యాచ్‌లలో ఆడిన గేల్ 4537 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులుగా ఉంది.