మ్యాచ్ కు ముందే గేల్ బాదుడు మొదలెట్టేశాడు

Wednesday, March 30th, 2016, 01:21:57 AM IST

gayle
ప్రస్తుతం భారత ప్రజల నోళ్ళలో నానుతున్న్ ప్రధానాంశాలలో టీ 20 వరల్డ్ కప్ కూడా ఒకటి. యువ అభిమానులైతే ఎపుదేప్పుడు మార్చి 31 వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గ్రూప్ స్టేజ్ లో వరుసగా బంగ్లా, ఆస్ట్రేలియాలను చిత్తు చేసి అనూహ్య రీతిలో సేమీస్ బరిలోకి దిగిన భారత్ సెమీస్ లో కూడా తన ఆశలన్నీ విరాట్ కొహ్లీపైనే పెట్టుకుని మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ గేల్ మాత్రం బరిలోకి దిగక ముందే మాటల యుద్ధం మొదలెట్టాడు.

వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న గేల్ కాసేపు మీడియాతో ముచ్చటించాడు. భారత్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ లను దీటుగా ఎదుర్కుంటామని అన్నాడు. అసలు తనకు బౌలర్ ఎవరన్నది తనకు అవసరం లేదని ఏ బంతినైనా బౌండరీకి తరలించడానికే ట్రై చేస్తానని.. భారత్ బౌలర్లను అందరినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్దంగా ఉన్నానని అన్నాడు. పైగా కోహ్లీ అద్బుత ఫామ్ లో ఉన్నప్పటికీ విండీస్ తో మ్యాచ్ గెలవడం అసాధ్యమని అన్నాడు. గేల్ చేసిన వ్యాఖ్యలతో అసలే వేడిమీదున్న అభిమానులు మరింత హాట్ గా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.