చిట్టీ ఈజ్ బ్యాక్‌: 2.0 అప్‌గ్రేడెడ్‌!

Thursday, October 26th, 2017, 12:47:49 PM IST

సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ – శంకర్ కాంబినేష‌న్ మూవీ `2.O` ఆడియో ఈ శుక్ర‌వారం (ఈనెల 27న) దుబాయ్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంద‌న్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 15 కోట్ల ఖ‌ర్చుతో ఈ ఈవెంట్‌ని వ‌రల్డ్ బెస్ట్ ఈవెంట్‌గా చేసేందుకు శంక‌ర్ అండ్ టీమ్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆడియో వేదిక సిద్ధ‌మైంది. ఇక ఈలోగానే 2.ఓ గ్లింప్స్ మొద‌ల‌య్యాయి.

ముందుగా ఆడియో లాంచ్‌కు ఓరోజు ముందే 2.ఓ కొత్త పోస్ట‌ర్‌ని లాంచ్ చేసింది టీమ్‌. ఈ పోస్ట‌ర్ చూడ‌గానే.. చిట్టీ ఈజ్ బ్యాక్‌: 2.0 అప్‌గ్రేడెడ్‌! అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. తెలివితేట‌లు నేర్చుకున్న చిట్టి రోబో ఈసారి మ‌రింత స్టైల్‌గా త‌యారై.. ఇదిగో ఇలా కాలుమీద కాలేసుకుని ద‌ర్జాగా కూచుంది. పోస్ట‌ర్‌పై ఆడియో లాంచ్ తేదీని ప్ర‌క‌టించారు. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు స‌హా ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నుంచి స్టార్ల‌ను ఆడియో ఈవెంట్ వేదిక వ‌ద్ద‌కు దించేందుకు 2.ఓ స్పెష‌ల్‌ హెలీ కాఫ్ట‌ర్లు రంగంలోకి దిగుతున్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఏ.ఆర్‌.రెహ‌మాన్ లైవ్ కార్య‌క్ర‌మం అభిమానుల్ని ప్ర‌త్యేకంగా అల‌రించ‌నుంది.