మహేష్ బాబుతో సినిమా చేయనున్న చిరు నిర్మాత

Sunday, February 28th, 2016, 07:38:41 PM IST

mahesh
తెలుగులో ఒకప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూజర్ అశ్వినీదత్. వైజయంతీ బ్యానర్ పై ఈయన ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్లతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తాజాగా ఓ మందపల్లిలో ఓ కార్యక్రమ రీత్యా మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో గౌతమ్ మీనన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నట్లు, ఆ సినిమాను వచ్చే సంవత్సరం మే లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే తన నిర్మాణ కెరీర్ లో చిరంజీవిగారితో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తనకు మంచి పేరు తెచ్చిందని తెలిపారు. మహేష్ సినిమాతో పాటు చరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు.. కానీ ఇంకా దానిపై ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. ప్రస్తుతం తన కూతురు ప్రియాంకా దత్ స్వప్నా బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కధతో సినిమా నిర్మించనున్నట్లు తెలిపారు.