సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలియచేసిన చిరంజీవి..!

Monday, November 23rd, 2020, 06:00:53 PM IST

గ్రేటర్ ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్ సినీ రంగానికి వరాలు కురిపించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మెగస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలియచేశారు. కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన కేసీఆర్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ నిజంగా ఊరటనిచ్చే అంశమని చిరంజీవి అన్నారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలను పెంచేందుకు అనుమతి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టికెట్ల ధరలను సవరించుకునే వెసలుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకి ఎంటో తోడ్పాటుగా ఉంటాయని అన్నారు. అయితే కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుందని చిరంజీవి తెలిపారు.