బిగ్ బ్రేకింగ్ : జగన్ పై చింతమనేని కాక రేపే కామెంట్స్.!

Tuesday, January 14th, 2020, 10:54:06 AM IST

వైసీపీ అధినేత మరియు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై ప్రతిపక్ష పార్టీ నేతలు మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా తమ విమర్శలను పండుగ పూట కూడా కొనసాగిస్తూనే ఉన్నారు.అయితే అదే తెలుగుదేశం పార్టీకు చెందినటువంటి కీలక నేత,ఫైర్ బ్రాండ్ ఐనటువంటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వై ఎస్ జగన్ పై తన నియోజకవర్గంలో జరుపుకుంటున్న భోగి సంబరాల్లో మాట్లాడుతూ జగన్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.

జగన్ ఇప్పుడు రాజధానిని మార్చడానికి ఒక బోగస్ కమిటీ వేసుకున్నారని ఆయన ఏం చెప్తే ఆ కమిటీ చెప్తుంది తప్ప ఆ కమిటీ వాళ్ళు చెప్పేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.అంతే కాకుండా అతని దగ్గర ఇప్పుడు 23 మంది ఎంపీలు ఉన్నారు..ఎన్నికల సమయంలో తనకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి అయినా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకొస్తానని అన్నాడని కానీ ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడేం చేస్తున్నావని ఇంకొకసారి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా తుగ్లక్ పనులు చేస్తున్నావ్ అంటూ జగన్ పై చింతమనేని సంచలన కామెంట్స్ చేసారు.