అందుకే జన సేన అభ్యర్దికి ప్రచారం చేస్తున్నా – చింతమనేని

Monday, March 8th, 2021, 08:48:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మున్సిపల్ మరియు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి చాలా చోట్ల ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. ప్రతి పక్ష పార్టీలు ఈ వ్యవహారం పై పూర్తి స్ధాయిలో అధికార పార్టీ వైసీపీ పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ మేరకు టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరొకసారి అధికార పార్టీ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏలూరు కార్పొరేషన్ 25 వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలనీ టీడీపీ అభ్యర్దిని విత్ డ్రా చేయించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలా చేయడం వలనే జన సేన పార్టీ అభ్యర్ధి కి ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే 25 వ డివిజన్ లో జన సేన పార్టీ అభ్యర్ధి తరపున చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. అంతేకాక అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోంది అంటూ ఆరోపించారు. అయితే చింతమనేని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చింతమనేని పై పలు కేసులు నమోదు కావడం మాత్రమే కాకుండా, జైల్లో సైతం ఉన్న సంగతి తెలిసిందే.