ఈ పిల్లాడు పెద్దవాడయ్యుంటే అందరినీ వరుసపెట్టి కాల్చేసేవాడేమో..!

Friday, April 22nd, 2016, 05:47:34 PM IST

BOY
అది చైనాలోని బీజింగ్ నగరం. అక్కదేరోద్దు మీద అక్రమంగా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు లోకల్ పోలీసులు. ఓ దుకాణాన్ని పోలీసులు తొలగిస్తుండగా ఆ కొట్టు యజమాని భార్యా, పిల్లలతో సహా అక్కడే ఉన్నాడు. పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇంతలో అతని రెండేళ్ళ కొడుకు మాత్రం పక్కనే ఉన్న పెద్ద పైప్ చేతిలోకి తీసుకుని పోలీసులకు ఎదురెళ్ళాడు. అమ్మానాన్నకి సపోర్ట్ గా నిలిచాడు.

తమ దుకాణాన్ని తొలగించవద్దని.. కనీసం తాకడానికి ప్రయత్నించినా మీ పని చెబుతాను అంటూ ఆ పిల్లాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ పిల్లాడి కోపాన్ని చూసిన జనాలు, పోలీసులు అవాక్కై అలా చూస్తుండిపోయారు. ఒకవేళ ఆ పిల్లాడే గనక పెద్దవాడై ఉంటే తుపాకి తీసుకుని అందరినీ కాల్చేసేవాడేమో అనుకున్నారు. ఈ తతంగాన్నంతా అక్కడున్న పోలీసులు, నగరవాసులు వీడియో తీసి నెట్ లో అప్లోడ్ చేయడంతో ఈ చైనా బుడతడు హీరో అయిపోయ్యాడు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :