కరోనా ఎఫెక్ట్: 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించిన చైనా..!

Monday, February 3rd, 2020, 04:34:36 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ నెమ్మది నెమ్మదిగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ సోకి దాదాపు 360 మందికి పైగా మృతి చెందగా, కొత్తగా మరో 2103 మందికి సోకినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అయితే ఈ వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి ప్రభుత్వం తక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

అందులోనే భాగంగా కరోనా బాధితుల కోసం 10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రిని నిర్మించి రికార్డ్ సృష్టించింది. అయితే విపత్తుల సమయంలో తాత్కాళిక పునారావాస కేంద్రాల కోసం “ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్”ని ఎప్పుడూ ఆ దేశం సిద్దంగా ఉంచుకుంటుంది. వాటన్నిటిని ఒక చోటుకు చేర్చి వూహాన్ నగరంలో ఈ 1000 పడకల ఆసుపత్రిని నిర్మించుకున్నారు. దీని నిర్మాణం కోసం 7000 మంది కార్మికులు డే అండ్ నైట్ కష్టపడి పనిచేశారు. ఈ ఆసుపత్రిలో 419 వార్డులు, 30 ICU లు ఉన్నాయి.