టీకా పంపిణీ విషయం లో కేంద్రం విఫలమైంది – చిదంబరం

Thursday, March 18th, 2021, 03:42:42 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 20 వేలు కాస్త, 30 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. అయితే మరో పక్క వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది. అయితే దేశం లో కరోనా వాక్సిన్ ప్రక్రియ పై చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకి టీకా పంపిణీ చేసే విషయం లో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలం అయింది అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రెండు నెలల్లో మూడు కోట్ల మందికి మాత్రమె టీకా పంపిణి పట్ల నిరాశ వ్యక్తం చేశారు చిదంబరం. అయితే భారత్ ఇప్పటి వరకూ కూడా 5.9 కోట్ల కరోనా వైరస్ వాక్సిన్ లను సరఫరా చేసినందుకు గర్విస్తున్నాను అని వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో భారతీయులకు కేవలం మూడు కోట్ల డోసు లను పంపిణి చేసినందుకు నిరాశ గా ఉందని పేర్కొన్నారు. ప్రజలు టీకా లు వేయించుకొనే క్రమం లో ఎదుర్కొంటున్న అడ్డంకులను కేంద్రం తొలగించాలి అని వ్యాఖ్యానించారు.