చంద్రబాబు ఫైర్ అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి

Saturday, September 19th, 2020, 12:09:42 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అయితే దేవుడును రాజకీయాలకి వాడుకున్న వారు దరిద్రులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే జంజం వేసుకున్న బ్రాహ్మణుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అని అన్నారు.సుబ్బారెడ్డి కి, ఆయన కుటుంబానికి ఉన్నటువంటి భక్తి భావం చంద్రబాబు నాయుడు కి, ఆయన కుటుంబానికి ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం సమంజసం కాదు అని, వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు మార్చుకోవాలి అని తెలిపారు. అయితే గతం లో పాదయాత్ర ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారి ను కొలిచి, భక్తి విశ్వాసం ఉన్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు పై ఇటు విమర్శలు చేస్తూనే, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పై ప్రశంసలు కురిపించారు.