ఆయనకి బదులు మంత్రి ఈటెల రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేంటి?

Thursday, February 4th, 2021, 10:24:53 AM IST

ఇంటి పార్టీ అధ్యక్షుడు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్ధి చెరుకు సుధాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని సోనియా గాంధీ రాష్ట్రం ప్రకటించారు అని, అయితే దళితుడు కి బదులుగా సీఎం పదవిని కేసీఆర్ దక్కించుకున్నారు అంటూ సుధాకర్ ఆగ్రహ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇది మాత్రమే కాక, కేటీఆర్ కి పదవి కట్టబెట్టనున్నారు అని ప్రచారం జరుగుతుంది అని, అయితే ఆయనకు బదులుగా మంత్రి ఈటెల రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేముంది అంటూ ప్రశ్నించారు.

అయితే మహబూబ్ బాద్ లో ప్రచారం నిర్వహించిన ఆయన, అంబేద్కర్ విగ్రహం కి పూల మాల వేసి నివాళి అర్పించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 3 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేశాం అని చెబుతున్నా, స్పష్టత లేదు అంటూ విమర్శలు చేశారు. అయితే కమ్యునిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న తనను పరిగణన లోకి తీసుకొని గెలిపించాలని కోరారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం దగ్గర పడుతుండటంతో అభ్యర్దులు ఒకరి పై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు.