ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Tuesday, October 27th, 2020, 11:54:13 AM IST

ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ రాజకీయాల్లో యాక్టిివ్ గా ఉంటున్నారు. అయితే తాజాగా ఖుష్బూ ను చెన్నై లో పోలీసులు అరెస్ట్ చేశారు. విసికే అధినేత తిరుమావలవన్ చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఖుష్బూ ఆందోళనకు దిగడం జరిగింది. మహిళల ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు అని ఖుష్బూ ఆరోపిస్తూ, బీజేపీ నేతలు నిరసన నిర్వహిస్తున్న విషయాన్ని ప్రకటించారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం తో చెన్నై నుండి చిదంబరం వెళ్తున్న సమయంలో ముత్తుకాడు సమీపం లో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.

అయితే ఖుష్బూ తో పాటుగా, మహిళ నేతలను, బీజేపీ నేతలని, కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటీవల తిరుమాలవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు అని ఖుష్బూ ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళల భద్రత విషయంలో బీజేపీ ప్రాధాన్యత ఇస్తుంది అని తెలిపారు. అయితే ఖుష్బూ అరెస్ట్ తో ఆందోళన మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.