అమరావతి ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ చీఫ్ విప్..!

Wednesday, December 16th, 2020, 02:00:50 AM IST

అమరావతి ఉద్యమంపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం ముమ్మాటికి ఉత్తరాంధ్ర వ్యతిరేక ఉద్యమమని అన్నారు. చంద్రబాబు బినామీల కోసమే ఉద్యమం చేశారని, కన్నభూమి అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖలో చంద్రబాబు, ఆయన బినామీలు కలిసి లక్షల ఎకరాలు దోచుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు.

అయితే బీజేపీ మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామని బీజేపీ చెప్పిందని, రాయల‌సీమ అభివృద్ధికి బీజేపీ ప్యాకేజీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. వీటన్నిటిపై సోము వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే రాజధాని ఉండాలని చెబుతున్న సోము వీర్రాజు బీజేపీ మేని‌ఫెస్టో‌లో ఏం పెట్టారో చదువుకోవాలని సూచించారు. శాసన రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, అమరావతిని అభివృద్ధి చేయమని తమ ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.