సీఎం జగన్ భార్య పేరుతో మోసాలు – చేస్తున్నది ఎవరో తెలుసా…?

Friday, February 14th, 2020, 12:48:58 PM IST

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో సతమతమవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఇదొక పెద్ద షాకింగ్ వార్త తగిలిందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజంలో రోజు రోజుకు కేటుగాళ్లు పెరిగిపోతూనే ఉన్నారు. కాగా రాష్ట్రంలోని పెద్ద వారికి పీఏ అంటూ మోసాలు చేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానికి తోడు అతడు వాడుకున్న పేరు ఎవరిదో తెలిస్తే షాక్ అవడం తప్ప మనం చేసేదేమి లేదు. ఎందుకంటే ఆ మోసగాడు వాడుకున్న పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి పేరు.

కాగా తాజాగా సత్యశ్రీరాం అనే ఒక మోసగాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి కి పీఏ అంటూ నమ్మబలికిన ఆ మోసగాడు ఒక నిరుద్యోగిని మోసం చేస్తూ నమ్మించాడు. అంతేకాకుండా అతడికి పంచాయతీరాజ్ లేదా సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని గత కొద్దీ రోజులుగా నమ్మబలుకుతూ వస్తున్నాడు. అందుకని కొంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడు. అయితే బాధితుడు సత్యశ్రీరాం మాటలను నమ్మిన ఆ బాధితుడు ఆన్‌లైన్‌లో రూ.లక్షకు పైగా సత్యశ్రీరాం ఖాతాలో వేశాడు. అయితే ఇదే తరహాలో మరొక బాధితుడు అఖిల్ అనే వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.