దుబ్బాక స్వతంత్ర అభ్యర్థి కత్తి కార్తీకపై చీటింగ్ కేసు..!

Friday, October 16th, 2020, 07:53:32 PM IST

బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదయ్యింది. ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయలు తీసుకున్నట్టు కత్తి కార్తీక, ఆమె అనుచరులపై బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తిక మధ్యవర్తిత్వం చేశారని, ఆమె అనుచరులు కోటి రూపాయల నగదును సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారని బాధితుడు చెబుతున్నాడు.

అయితే ఈ కేసుపై ఇంకా కత్తి కార్తీక స్పందించలేదు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండడంతో స్వతంత్ర అభ్యర్థిగా కత్తి కార్తీక పోటీ చేయబోతుంది. సిద్దిపేట జిల్లా బీసీ (గౌడ) సామాజికవర్గానికి చెందిన కత్తి కార్తీక ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ తరుణంలో ఆమెపై చీటింగ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతుంది.