ఈ రోజే చార్మీ పెళ్లి!

Tuesday, April 7th, 2015, 02:37:53 PM IST

charmi
ప్రముఖ టాలీవుడ్ నటీమణి చార్మి నేడు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పటి వరకు చార్మి పెళ్లి గురించి ఎటువంటి న్యూస్ రాలేదు ఇదంతా రూమర్ ఏమోనని కొట్టిపారేయకండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ మేరకు చార్మి తన ట్విట్టర్ ఖాతాలో ‘ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాను’ అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటోందా? లేదా ఏదైనా షూటింగ్ లో భాగంగా పెళ్లి దుస్తుల్లో ఫోటో దిగి సరదాగా పోస్ట్ చేసిందో ఆమెకే తెలియాలి. ఇక ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 4వ తేదీన ‘ఓ యఎస్.. ఐ యాం ఇన్ లవ్’ అంటూ చార్మి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ‘నీతోడు కావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన చార్మి అటు తరవాత ‘శ్రీ ఆంజనేయం’, ‘మంత్ర’ వంటి సినిమాలతో క్రేజు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.