నవంబర్ నుండి చరణ్ – ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ ?

Sunday, June 10th, 2018, 11:30:48 AM IST

టాలీవుడ్ లో తెరకెక్కే క్రేజీ మల్టీస్టారర్ కోసం రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. బాహుబలి లాంటి సూపర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మల్టి స్టారర్ పట్టాలు ఎక్కేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అయిన ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకోసం హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీ సెట్టింగ్ వేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ పాత్రలపై తెగ రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు పూర్వ జన్మల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు .. మొత్తానికి అప్పట్లో హిందీలో సంచలన విజయం అందుకున్న కరణ్ అర్జున్ తరహాలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.