మెదడులోని ‘అమిగ్దాల’ రెచ్చిపొతే అలా చేస్తారా..?

Tuesday, December 22nd, 2015, 03:48:00 PM IST

ఇటీవల కాలంలో బాల్యంలోనే తప్పులు చేసి జైలుకు వెళ్తున్న వారి సంఖ్య భారత్ లో పెరిగిపోతున్నది. దీనికి కారణం చుట్టూ ఉన్న సమాజంతో పాటు ఆర్ధిక స్థితిగతుల తేడా కూడా అని అంటున్నారు పరిశోధకులు. ఇక విదేశాల్లో జ్యువనైల్ చట్టం ప్రకారం 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలు తప్పుచేస్తే.. వారికి మూడేళ్ళకు మించి శిక్ష విధించరు. అక్కడ బాలనేరస్తుల ఏజ్ 16 సమత్సరాలైతే.. మనకు 18 సంవత్సరాలుగా ఉన్నది. కాని, ఇప్పుడు విదేశాల్లో మాదిరిగానే.. మనదగ్గర కూడా 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ.. ప్రజాపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.

ప్రజాపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేంద్రం బాలనేరస్తుల వయసును 18 నుంచి 16 తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లును లోక్ సభలో ఆమోదింపజేసి.. రాజ్యసభకు పంపింది. ప్రసుత్తం రాజ్యసభలో ఈ బిల్ పెండింగ్ లో ఉన్నది. ఇక, బాల నేరస్తుల వయసును తగ్గిస్తే.. నేరాలు తగ్గుతాయా.. నేరాలు చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తే.. అది ఎంతవరకు ఫలిస్తుంది అనే దానిపై రాజ్యసభలో చర్చ నడుస్తున్నది. మానసికంగా బాధకు లోనైతే.. ఫ్రంటల్ కార్టెక్స్ కుంచించుకు పోతుంది. ఇలా ఫ్రంటల్ కార్టెక్స్ కుంచించుకు పొతే.. అమిగ్దాల రెచ్చిపోతుంది. దీంతో నేరాల స్వభావం పెరిగిపోతుందని దీనిపై పరిశోధన చేస్తున్న చటర్జీ చెప్తున్నారు. మెదడు యొక్క పనితీరును.. దానిని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే.. కనీసం 21 లేదా 22 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆగాలని ఆయన అంటున్నారు. మరి ఒత్తిడికి తలొగ్గి బాలనేరస్తుల వయసును తగ్గిస్తారో లేక.. ఇప్పడున్న విధంగానే అలాగే కంటిన్యూ చేస్తారో చూద్దాం.