బిగ్ న్యూస్: హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయనున్న చంద్రబాబు!

Wednesday, March 17th, 2021, 12:00:15 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాజధాని అమరావతి భూ కుంభకోణం విషయం లో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసులకి గానూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిటీషన్ దాఖలు చేయనున్నారు. తన పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాల్సింది గా పిటిషన్ వేయనున్నారు. అయితే కక్ష సాధింపు చర్యలలో భాగంగానే చంద్రబాబు పై కేసులు నమోదు చేసినట్లు తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మంగళవారం నాడు అనూహ్యంగా చంద్రబాబు ఇంటికి సిఐడి అధికారులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని భూముల అక్రమాల విషయం లో చంద్రబాబు కి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23 వ తేదీన విచారణ కి హాజరు కావాల్సింది గా అధికారులు చంద్రబాబు కి నోటీసులు జారీ చేశారు. అయితే చంద్రబాబు పై 120బీ, 166, 167, 217 సెక్షన్ల తో పాటుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నమోదు చేశారు. దీని పై టీడీపీ నేతలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.