నేటి నుండి కుప్పం లో చంద్రబాబు పర్యటన

Thursday, February 25th, 2021, 09:25:07 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గం లో పర్యటించనున్నారు. అయితే అక్కడి నాయకులతో, కార్యకర్తలతో మూడు రోజుల పాటు చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. అక్కడి పరిస్థితులు మరియు కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకొనున్నారు చంద్రబాబు. అయితే పంచాయతీ ఎన్నికల్లో కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా, సొంత నియోజక వర్గం అయిన కుప్పం లో కూడా ఓటమి పాలు కాక తప్పలేదు. అయితే ఈ మేరకు అక్కడి నేతలు పార్టీ నీ సైతం వేసేందుకు సిద్దంగా ఉన్నారు.

అయితే చంద్రబాబు పర్యటన లో కుప్పం నియోజకవర్గం లో ఉన్న సమస్యలు మాత్రమే కాకుండా, పార్టీ లో ఉన్న విభేదాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కుప్పం నియోజకవర్గం లో తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ పీఎస్ మునిరత్నం సర్పంచ్ గా ఓటమి పాలు అయ్యారు. అయితే ఈ మేరకు అతను పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే సమాచారం.