బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలి – చంద్రబాబు

Sunday, January 31st, 2021, 08:04:39 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కీలక నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతి ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దశల వారీగా జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయం పై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పంచాయతి ఎన్నికల్లో టీడీపీ నేతలు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దంగా ఉండాలి అని పిలుపు ఇచ్చారు. తొలి దశ నామినేషన్ ప్రక్రియ లో అన్ని స్థానాలకు నామినేషన్ వేయాలని సూచించారు.

అయితే బలవంతపు ఏక గ్రీవాలను అడ్డుకోవాలి అని ఆదేశించారు. బైండోవర్ కేసులు మరియు అపహరణ లతో అభ్యర్థులను భయపెట్టాలి అని చూస్తే సహించేది లేదు అని, వాలంటీర్ ల ద్వారా ప్రలోభ పెట్టాలి అని చూస్తే తిప్పి కొట్టాలి అని, ఫిర్యాదులు చేయాలని సూచించారు. అయితే వైసీపీ గుండాల చేతిలోకి వెళ్తే గ్రామాలకి కన్నీరే మిగులుతుంది అని, వైసీపీ నాయకులు గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకి వేదికలు గా మార్చారు అంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.