వైసీపీ రౌడీయిజం చేస్తుంది.. చంద్రబాబు సీరియస్ కామెంట్స్..!

Tuesday, October 27th, 2020, 06:59:53 AM IST

Chandrababu-Naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీపై మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. కుప్పం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రశాంతంగా ఉండే కుప్పంలో అధికార పార్టీ వైసీపీ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ రౌడీయిజం చేస్తుందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం నిజంగా వైసీపీ కక్ష సాధింపు చర్యేనని అన్నారు.

అయితే టీడీపీ హయాంలో ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేశామని, సీఎం జగన్‌ నియోజకవర్గం పులివెందులకు కూడా నీళ్లిచ్చామని అన్నారు. ఇదిలా ఉంటే హుంద్రీనీవా సాధనకు నేటి నుంచి 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గ పరిధిలో పాదయాత్రకు టీడీపీ రెడీ అవ్వగా, టీడీపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వైసీపీ కూడా రెడీ అయింది. దీంతో కుప్పంలో ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.