షాకింగ్ న్యూస్: రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ఫై స్పందించిన చంద్రబాబు

Tuesday, January 14th, 2020, 02:30:37 AM IST

కాంగ్రెస్ పార్టీ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అమరావతి రాజధాని ఫై చేసిన వ్యాఖ్యలకు గాను మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. రేవంత్ రెడ్డి అమరావతి పరిస్థితి పట్ల జాలి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి, పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్ కారణం అని చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. అయితే చంద్రబాబు రేవంత్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నట్లుగా స్పందించారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తప్పులు చూపే ప్రయత్నం చేసారు. అంతేకాకుండా తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేసారు. మూడు రాజధానుల నిర్ణయం ఫై మొదటినుండి టీడీపీ వ్యతిరేకతని తెలియజేస్తుంది. అమరావతి లో జరిగే ఘటనల ఫై ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఫై అమరావతి రైతులు హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి అందరికి తెలిసిందే, మరి ఈ విషయం ఫై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.