108,104 రథయాత్ర వేడుకల్లో చంద్రబాబు ఫోటో!

Friday, July 3rd, 2020, 05:55:42 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 108, 104 అంబులెన్స్ వాహనాలు అయా ప్రాంతాలకు చేరుకున్నాయి. అయితే తిరుపతి లో చేపట్టిన 108, 104 రథయాత్ర వేడుకల్లో ఒక తప్పిదం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పక్కన చిన్నగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు. అంతేకాక ఈ ఫ్లెక్సీ లో వైయస్సార్ ఫోటో కూడా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకొనే లోపే ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇపుడు ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియా లో కూడా వైరల్ గా మారింది.

1088 వాహనాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో అంబులెన్స్ వాహనాల వినియోగం తగ్గగా, ముఖ్యమంత్రి జగన్ అత్యాధునిక సదుపాయాల తో ఈ వాహనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.