ప్రధాని మోదీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు..!

Monday, August 17th, 2020, 12:11:58 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. రాజకీయ లాభాల కోసమే చట్టవిరుద్ధంగా వైసీపీ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని, ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కూడా లేఖను పంపించారు.