ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి మరోసారి లేఖ రాసిన చంద్రబాబు..!

Monday, October 5th, 2020, 11:07:17 AM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడం ప్రాథమిక హక్కులు కాలరాయడం నిత్యకృత్యం జరుగుతున్నాయని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఏపీ పోలీసులపైనే అత్యధిక కేసులు నమోదవ్వడం రాష్ట్రానికి సిగ్గుచేటని అన్నారు.

అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు, ఆస్తుల విధ్వంసం, దుర్భాషలు వంటివి చేస్తున్నారని రూల్ ఆఫ్‌ లా అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ దుశ్చర్యలను నిరసించిన టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని విజయవాడలో టీడీపీ నేత పట్టాభి కారు ధ్వంసానికి పాల్పడి ఆయన గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శిరోముండనాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, ఈ వరుస ఘటనలే పోలీసులపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పోగొట్టాయని అన్నారు.