వారిని ఆదుకోండి.. సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు లేఖ..!

Tuesday, August 18th, 2020, 07:23:07 AM IST

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలంటూ కోరారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తి ఉభయ గోదావరి జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

అంతేకాదు ఒకవైపు కరోనా, మరోవైపు వరద ముంపుతో ప్రజలకు ఊహించని కష్టాలు వచ్చాయని అన్నారు. వేలాది ఎకరాలలో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారిని ఆదుకోవాలని, అన్ని వసతులు కల్పించాలని కోరారు. అలాగే ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.