నేరస్థుల పై కఠిన చర్యలు తీసుకోండి…ఏపీ డీజీపీ కి చంద్రబాబు లేఖ

Wednesday, September 2nd, 2020, 01:34:34 AM IST


రాష్ట్రంలో జరుగుతున్న పలు నేరాల పై, అన్యాయాల పై డీజీపీ గౌతం సవాంగ్ కి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు. రాష్ట్రం లో శాంతిభద్రతలు క్షీణించాయి అని చంద్రబాబు నాయుడు లేఖ లో వివరించారు. దళితుల పై అనుమానాస్పద రీతి లో మరణాలు, మీడియా ప్రతినిదుల పై దాడులు జరుగుతున్నాయి అని తెలిపారు. అంతేకాక నేరస్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. గత ఏడాది కాలం లో శాంతి భద్రతలు దారుణ స్థితి కి చేరాయి అని చంద్రబాబు నాయుడు తెలిపారు.

అయితే దోపిడీ దారులు, గుండాలు, మాఫియా శక్తులు అన్ని ఏకమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యం గా మార్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన దాడులలో అధికార పార్టీ కి చెందిన వారు ఉన్నందునే, వాళ్ళ పాత్ర బయటికి రానివ్వకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి అని లేఖ లో స్పష్టం చేశారు. పలు దాడులను లేఖ లో వివరించిన అనంతరం, అటువంటి దాడులు పునరావృతం కాకుండా, చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ కి రాసిన లేఖ లో చంద్రబాబు నాయుడు తెలిపారు. మరి దీని పై డీజీపీ మరియు అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.