సీఎం జగన్ కి చంద్రబాబు లేఖ…హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి

Thursday, December 10th, 2020, 07:32:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అని అన్నారు. బాధితుల సంఖ్య పెరిగిపోవడం, కారణాలు తెలియక పోవడం, వింత వ్యాధిగా ప్రచారం సాగుతుండటం తో ప్రజలు భీతిల్లుతున్నారు అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్యం విషయం లో ప్రభుత్వం విఫలం అయింది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం పై రానున్న కాలం లో చూపే దుష్ప్రభావాలను పరిగణన లోకి తీసుకొని ప్రతి రోగికి కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే క్విక్ రెస్పాన్స్ టీమ్ లను నియమించి సత్వర ఉపశమన చర్యలను చేపట్టాలని కోరారు. మొబైల్ మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత తాగునీటి ను అందించాలని ల, ప్రతి బాధితుని కి ఆరోగ్య భీమా, జీవిత భీమా కల్పించే బాధ్యత ను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్ల మేరకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.