ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా?

Thursday, August 27th, 2020, 03:00:27 AM IST


చంద్రబాబు నాయుడు మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి అంటూ డీజీపీ కి లేఖ రాశారు. శిరోముండనం ఘటన మరువకముందే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఇదేనా ప్రజాస్వామ్యం? వైసీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలకడం వల్లే ఈ అనర్థాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం ప్రతాప్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, అతని కాల్ లిస్ట్‌ను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ను లేఖ లో కోరడం జరిగింది. అయితే ఇందుకు డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన పై చంద్రబాబు ప్రెసిడెంట్ కి, ప్రధాని కి లేఖ రాశారు అని, ఆ ఘటన కి కారకులు అయిన వారి పై కేసులు పెట్టి శిక్షించాలి అని కోరిన చంద్రబాబు రమేష్ ఆసుపత్రి లో పదిమంది ప్రాణాలు కోల్పోతే కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు కులం కనిపిస్తుంది అంటూ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.