అలా చేయడమే బాలు కి మనం అందించే నిజమైన నివాళి – చంద్రబాబు

Sunday, September 27th, 2020, 11:00:02 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తెలుగు వారిని మాత్రమే కాక, యావత్ భారతావని ను దిగ్భ్రాంతి కి గురి చేసింది. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరు జిల్లాలో సంగీత విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు. అయితే ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు.

ఏటా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి ను రాష్ట్ర పండుగ నిర్వహించాలని, అంతేకాక సంగీత వర్సిటీ లో ఎస్పీ బాలు కాంస్య విగ్రహ ఏర్పాటు చేయాలి అని రాష్ట్రం ప్రభుత్వం ను కోరుతూ సీఎం జగన్ కి లేఖ రాశారు. అంతేకాక ఆ ప్రాంతాన్ని బాలు కళాక్షేత్రం గా అభివృద్ది చేయాలని కోరారు. ఎస్పీ బాలు పేరిట జాతీయ అవార్డ పురస్కారం తో పాటుగా, ప్రభుత్వ సంగీత అకాడమీ కి ఆయన పేరు పెట్టాలి అని అన్నారు. యువతను అన్ని కళ్ళలో ప్రోత్సహించాలి అని, ప్రాచీన తెలుగు కళా సారస్వత ను గౌరవించడం ద్వారా మరియు మన సంస్కృతి సాంప్రదాయాలు సమున్నత స్థాయిలో నిలబెట్టడం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి మనం అందించే నిజమైన నివాళి అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు.