ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న స్త్రీ మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు – చంద్రబాబు

Monday, March 8th, 2021, 10:32:06 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి శుభాకాంక్షలు తెలిపారు. సకల రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటూ, ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న స్త్రీ మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. స్త్రీ మానవత్వం, సాధికారతలే మన సమాజ ప్రగతికి మూలం అని తెలుగు దేశం ఆవిర్భావ దినం నుండి నమ్ముతున్న సిద్దాంతం అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు అని వ్యాఖ్యానించారు. కానీ మహిళల పై దేశం మొత్తం మీద జరిగే నేరాలలో మూడో వంతు ఆంధ్ర ప్రదేశ్ లోనే జరుగుతున్నాయి అని నివేదికలు చెబుతుంటే బాధేస్తుంది అని వ్యాఖ్యానించారు.