మనిషిని దేవుడితో పోల్చడం సరికాదు – చంద్రబాబు నాయుడు

Thursday, April 8th, 2021, 12:33:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి తిరుమల అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు ఉదయం తిరుమల శ్రీవారి ను విఐపి ప్రారంభ దర్శన సమయం లో దర్శించుకున్నారు చంద్రబాబు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబు కి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి, ప్రసాదం అందించారు. అయితే దర్శనం ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి శ్రీవారు అని, శ్రీవారి ఆలయ పవిత్రత ను కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే గతంలో శ్రీవారి పింక్ డైమండ్ పోయింది అంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అంతేకాక మనిషిని దేవుడి తో పోల్చడం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి అపచారాలు గతంలో కూడా చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు తో పాటుగా పలువురు తెలుగు దేశం పార్టీ నేతలు దర్శనం లో పాల్గొన్నారు.