ఎవరేం చేస్తార్లే అని కౌంటింగ్ వదిలేశారు.. కుప్పం నేతలకు చంద్రబాబు క్లాస్..!

Sunday, February 21st, 2021, 01:25:57 AM IST

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కుప్పంలో టీడీపీ దారుణంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఆయనపై అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో సెటైర్లు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా నేడు కుప్పం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన చంద్రబాబు వారికి క్లాస్ తీసుకున్నారు.

అయితే టీడీపీ నేతలు పోలింగ్ బూత్ లను, కౌంటింగ్‌ను విడిచిపెట్టి ఎవరేం చేస్తార్లే అని వదిలేసి తిరిగారని ఈ లోపల వైసీపీ నేతలు, అధికారులు కలిసి ఫలితాలను తారుమారు చేశారని అన్నారు. మన బలహీనతలు, అనైక్యతలను అవతలివారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారని తెలిపారు. మనం ఎంత బాగా పని చేసినా అధికార పార్టీ అరాచకాల వల్ల ఓటమిపాలయ్యామని చెప్పారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక వడ్డీరో సహా తీర్చుకుంటామని నేత్లకు ధైర్యం చెప్పారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని త్వరలోనే నేనొస్తా రెండు మూడు రోజులుండి పరిస్థితులను సమీక్షిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే తాము ఎన్నికల్లో సమిష్టిగా పనిచేశామని, అధికార పార్టీ అరాచకం, డబ్బుల పంపిణీ వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని స్థానిక నేతలు చంద్రబాబుకు చెప్పుకున్నారు.