ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా.. డీజీపీపై చంద్రబాబు ఫైర్..!

Tuesday, September 29th, 2020, 07:04:17 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో దళితులపై, ఆలయాలపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్ నోరు తెరిచి మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. జగన్ భజన తప్పా ప్రజా సమస్యల పరిష్కారంపై వైసీపీ నేతలు దృష్టిసారించడం లేదని అన్నారు.

ఇక ఏపీ డీపీ గౌతమ్ సవాంగ్ తనకు లేఖ రాయడం హాస్యాస్పదమని, సీల్డ్ కవర్‌లో సాక్ష్యాధారాలు పంపమని కోరారని అన్నారు. తాను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా లేక ప్రతిపక్షానిదా అని ప్రశ్నించారు. దళితులపై, దేవాలయాలపై వరుస దాడులు జరగడం రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేదని అన్నారు. సీఎం జగన్, కొందరు పోలీసుల అలుసు చూసుకునే నేరస్థులు రెచ్చిపోతున్నారని అన్నారు. పాత స్కీమ్ లకు పేర్లు మార్పే తప్ప కొత్త పథకాలు ఏమీ లేవని అన్నారు. అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, బీమా, పండుగ కానుకలు అన్నీ రద్దు చేశారని విమర్శలు గుప్పించారు.