రైతురాజ్యం తెస్తాన‌ని గ‌ద్దెనెక్కారు.. జగన్ పాలనపై చంద్రబాబు సీరియస్..!

Friday, January 15th, 2021, 12:53:16 AM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే సంక్రాంతి రోజున అప్పులు బాధ‌తాళ‌లేక అనంత‌పురం జిల్లా అమ‌రాపురం మండ‌లం గౌడ‌న‌కుంట గ్రామ రైతు ఉగ్ర‌ప్ప ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం విచార‌క‌రమని అన్నాడు. అయితే రైతురాజ్యం తెస్తాన‌ని గ‌ద్దెనెక్కిన జగన్ పాల‌న‌లో పంట‌లకు మ‌ద్ద‌తు ధ‌ర‌లేక‌, చేసిన అప్పులు తీర్చ‌లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అయితే రైతు రాజ్యం పోయి చివ‌రికి రైతులేని రాజ్యంగా మిగిలే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు రాష్ట్రంలో నెల‌కొన్నాయని, ఉగ్ర‌ప్ప కుటుంబాన్ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.