సీఎం జగన్ పబ్‌జీ ఆడుకుంటున్నావా.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

Tuesday, February 16th, 2021, 10:14:00 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత వారం రోజులుగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అమరణ నిరాహార దీక్షను ఈ రోజు ఉదయం పోలీసులు భగ్నం చేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారని అన్నారు. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం విశాఖలో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేస్తూ టీడీపీ చేస్తున్న ఉద్యమానికి చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని? సీఎం జగన్ ఎక్కడున్నారు.. పబ్జీ ఆడుకుంటున్నారా అని నిలదీశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు చూస్తే దొంగే దొంగ అని అరిచినట్టు ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు ఎందరో ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని అలాంటి స్టీల్ ప్లాంట్ ను మీ కేసుల కోసం తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు.