స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగలేదు.. ఎస్ఈసీపై మండిపడ్డ చంద్రబాబు..!

Monday, February 22nd, 2021, 06:46:35 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతవరణంలో జరగలేదని ఎన్నికల కమీషన్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎస్ఈసీ పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాలని హైకోర్టు ఆదేశించిందని కానీ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎస్ఈసీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అయితే పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ నిర్వీర్యమయ్యిందని అధికార యంత్రాంగం బరితెగిస్తే వాళ్లపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు అన్నారు. చాలా చోట్ల టీడీపీ గెలిచిన స్థానాలను వైసీపీ గెలిచినట్లు ప్రకటించారని, వైసీపీ నేతల బెదిరింపులతో ప్రజలు స్వేచ్చగా ఓటు వేయలేకపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ 40 శాతానికి పైగా పంచాయితీ స్థానాలను గెలుచుకుందని, ఎన్నికలు సరైన ధోరణిలో జరిగి ఉంటే టీడీపీకి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చేవన్ని చంద్రబాబు అన్నారు.