ఆ అధికారం ఎవరిచ్చారు.. జగన్ సర్కార్‌పై మండిపడ్డ చంద్రబాబు..!

Thursday, September 17th, 2020, 12:03:57 AM IST


ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలపై నేడు మీడియాతో మాట్లాడిన టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ఆలయాలపై జరుగుతున్న ఘటనల గురుంచి సీఎం జగన్ నోరు మెదపాలని అన్నారు. మాట్లాడితే తమకు అధికారం ఉంది, ఎక్కువ సీట్లు ఉన్నాయని అంటున్నారని భక్తుల నమ్మకాలను వమ్ము చేసే అధికారం మీకు ఎవరిచ్చారని అన్నారు.

అయితే అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందన్న గర్వంతో ముందుకెళ్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని, ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోక తప్పదని హెచ్చరించారు. ఇక వైసీపీ మంత్రులు పద్ధతి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే ఆలయాల ధ్వంసంపై ఏడురోజుల పాటు టీడీపీ నిరసనలు తెలుపుతుందని, ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.