కరోనాను నియంత్రణ చేయలేక వైసీపీ చేతులెత్తేసింది – చంద్రబాబు నాయుడు

Thursday, September 3rd, 2020, 11:57:25 PM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా విజృంభించిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్యనిపుణులతో చంద్రబాబు ఆన్‌లైన్లో సమావేశమయ్యారు. కరోనా వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక, ఇతరత్రా అనేక సమస్యలు తలెత్తున్నాయని అన్నారు.

అయితే కరోనా పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఎప్పటికప్పుడు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. సంక్షోభం ఎప్పుడు వచ్చినా ఆదుకునేందుకు టీడీపీ ముందుంటుందని అన్నారు. కరోనా కారణంగా చాలా రంగాలు దెబ్బతిన్నాయని, వాటన్నిటిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రతి పేద కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రోజుకు 10 వేలకు మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని, ప్రభుత్వం కరోనాను నియంత్రణ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు.